Bangarukonda Song Lyrics in Telugu
బంగారు కొండా మరుమల్లె దండా
మనసైన అండ నువ్వేరా
కనుపాప నిండా నీ రూపు నిండ
నా బ్రతుకు పండా రావేరా
శ్వాసించలేను నిను చూడకుండా
జీవించలేను నిను చేరకుండా
ఏకాంత సరసాలు సాయంత్ర సరదాలు ప్రేమంత రాగాలు పలికించు ప్రియుడా
గోరంత విరహాలు కొండంత మురిపాలు జల్లంత జలసాలు జరిపించు ఘనుడా
నీ అడుగు జాడ అది నాకు మేడ
Also, Read:
- Find Here to Listen Songs hindisongs.cc
- How to watch Video songs englishsongs.club
బంగారు కొండా మరుమల్లె దండా
మనసైన అండ నువ్వేరా
కనుపాప నిండా నీ రూపు నిండ
నా బ్రతుకు పండా రావేరా
చరణం 1:
ఈ మహరాజు చిరునవ్వునే నా మణిహారమనుకొందునా
ఈ వనరాణి కొన చూపులే నా ధనధాన్యమనిపించనా
నువ్వే నువ్వే నరసింహ స్తోత్రం ఒడిలో గుడిలో వల్లించనా
నువ్వైనావే గాయత్రి మంత్రం పగలూ రేయీ జపియించనా
నీ కరుణ కిరణాలు
హృదయాన ఉదయాలు
నీవెంటె నా మనుగడ
నీ గుండె నా తలగడ
బంగారు కొండా మరుమల్లె దండా
మనసైన అండ నువ్వేరా
కనుపాప నిండా నీ రూపు నిండ
నా బ్రతుకు పండా రావేరా
చరణం 2:
నీ మీసాల గిలిగింతకే ఆ మోసాలు మొదలాయెనా
నీ మునివేళ్ళ తగిలింతకే ఆ మునిమాపు కదలాయెనా
నీకే నీకే సొగసాభిషేకం నిమిషం నిమిషం చేయించనా
నీతో తనువు మనసే మమేకం మనదో లోకం అనిపించనా
సంసార కావ్యాలు
సంస్కార కార్యాలు
కలగలపు గుణవంతుడా
కలియుగపు భగవంతుడా
బంగారు కొండా మరుమల్లె దండా
మనసైన అండ నువ్వేరా
కనుపాప నిండా నీ రూపు నిండ
నా బ్రతుకు పండా రావేరా